శ్రీ వారి నగల గురించి తెలుసుకుందాం. బంగారు పాదకవచాలు,
కాలి అందెల గజ్జెలు,పట్టు పీతాంబర కుచ్చేళ్ళపై జిరాడే
సహస్ర మాలలు, బొడ్డు వద్ద సూర్యకఠారి అనే నందక ఖడ్గం,
ఒడ్డాణం, బంగారు మొలత్రాడు, తనపాదాలే పరమార్దమని
తెలిపే వజ్ర ఖచిత వరద హస్తం (కుడివైపు ), తనను శరణు
కోరితే సంసార సముద్రాన్ని మోకాటి లోతుననే ఉంచుతానని
తెలిపే కటి హస్తం (ఎడమవైపు),ఎదపై కౌస్తుభమణి,నవరత్న
హారాలు, బంగారు యజ్ఞోపవితం,శ్రీదేవి భూదేవి మాలలు,
నాగా భరణాలు, భుజ కీర్తులు,భుజములనుండి
సాలగ్రామ మాలలు, శంఖు చక్రములు,కర్ణాభరణాలు,
శిరస్సుపై నవరత్నఖచిత వజ్ర కిరీటం,బంగారు మకర
తోరణం . ఇవి మూల మూర్తికి ఉండే నగలు.ఇవికాక
ఉత్సవమూర్తులకు అనేకమైన నగలు ఉన్నాయి.
వాటి వివరాలు చెప్పుకొనుట మన బోటివారికిసాద్యం కాదు











